Step into an infinite world of stories
The first book in Telugu on the upbringing of teens. How to reduce children's unhealthy interest in video games, chatting, sets, TV. What should adults do if children want to read well? If some teens are performing miracles, why do some become funky? Why do adults force children to be what they want to be? No license is required to pass the tenth grade, or eventually to drive a small cart, to take the test/license, or to become a parent or raise a child. 'Children grow up naturally. Why books and exams for it? Which guide did adults read and raise in the past? ' Is a one-time argument. However, the current competitiveness did not exist then. There are no grandparents in the house. Under such circumstances, this is a complete book on guidelines for cultivating teens' personality, from "attractive unhealthy tastes to irrational technology".
టీన్స్ పెంపకంపై తెలుగులో తొలి పుస్తకం. వీడియో గేమ్స్, ఛాటింగ్, సెట్, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా? అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి? పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి? టీన్స్ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు? కొందరు టీన్స్ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు? తాము అనుకన్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు? పదవ తరగతి పాస్ అవ్వాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా, పరీక్ష/లైసెన్స్ ఉంటుంది గానీ, పేరెంట్ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. 'పిల్లలు న్యాచురల్ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్ చదివి పెంచారు?' అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, ''ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ'' నుంచి టీన్స్‌ని, వ్యక్తిత్వంతో పెంచటానికీ కావలసిన గైడ్-లైన్స్‌పై సంపూర్ణమైన పుస్తకం.
© 2021 Storyside IN (Audiobook): 9789353987220
Release date
Audiobook: 14 January 2021
English
India